Pages

Mr Perfect from My View

3rd day morning show in Gokul 70mm Erragadda

సినిమా lecture scene తో ప్రారంభం అయింది . చిన్న పిల్లాడికి జీవితం గురించి తండ్రి చెపుతాడు . నీకు నచినట్టు వుంటే కొంత సంతోసిస్తావు , నలుగురికి నచేటట్టు వుంటే నీతో పటు అందరు సంతోషిస్తారు అని . కానీ ఆ పిల్లడు తండ్రి చెప్పినదానికి విరుద్దంగా అలోచించి జీవితం లో ఇంకా తనకి నచినట్టే వుంటా అని నిర్ణయించుకుంటాడు . ఆ పిల్లాడే ప్రభాష్ .

పెద్దయ్యాక ప్రభాష్ ఎలా వుంటాడు ఎం చేస్తాడు అన్నది ఆస్ట్రేలియా scenes లో చూపించారు .

చెల్లి పెళ్ళికి ఇండియా కి వచ్చిన ప్రభాస్ , కాజల్ ని కలుసుకోవడం మొదట్లో తనతో గొడవలు తరువాత స్నేహం scenes బాగున్నాయి

భ్రమ్మానందం , భరత్ కుమార్ కామెడీ చెయ్యాలని ప్రయతించారు కానీ అంతా బాగా రాలేదు కానీ enjoy చెయ్యవచు

ఉహించాగలిగే మలుపు తో విరామం (intervel)

తరువాత ప్రభాష్ తనలానే ఆలోచించే తప్సీ ని కలుసుకోవడం , పెళ్లి చేసుకోవాలని ప్రకాష్ రాజ్ ని కలుసుకోవడం , ప్రకాష్ రాజ్ పందెం మేరకు తప్సీ అక్క పెళ్ళికి ప్రభాష్ వెళ్ళడం, అక్కడ ప్రభాస్ లైఫ్ గురించి చిన్నప్పుడు తన తండ్రి చెప్పింది అర్ధం చేసుకోవడంతో సినిమా అయిపోతుంది

రెండవ భాగం లో రఘు బాబు కామెడీ చేసాడు, కొన్ని చోట్ల బాగానే వుంది

ఒక సీన్ లో ప్రభాష్ తన పరిస్తితి ఉహించుకున్తప్పుడు అన్ని cahracters మగదీర వెసంలో రావడం కామెడీగా బాగుంది
తప్సీ తో ప్రభాష్ scenes అన్ని చాల వేగంగా మనం అర్ధం చేసుకునేలోపే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకోవడం అయిపోతుంది
కాజల్ సాంప్రదాయ dressesలో చాల అందం గా వుంది.

జీవితం గురించి అర్ధం చేసుకున్న ప్రభాష్ చెప్పే dialogues బాగున్నాయి, ప్రభాష్ నటన బాగున్నా ఇంకా చెయ్యలిసింది అనిపించింది

రెండవ భాగంలో ప్రభాష్ తనను తను మార్చుకోటానికి ముక్యమైన కారణం ఆ క్రికెట్ మ్యాచ్ కాబట్టి ఇంకా బాగా తిసివుండవలసింది,
remote cars సీన్ too bad

No comments:

Post a Comment